: ఈనెల 26 వరకు బ్రస్సెల్స్‌ విమానాశ్రయం తెర‌చుకోదు


ఉగ్ర‌దాడుల నేప‌థ్యంలో బ్రస్సెల్స్‌ విమానాశ్రయాన్ని ఈనెల 26 వరకు మూసి ఉంచనున్నారు. శనివారం నుంచి ఏ విమాన సర్వీసులను నడపనున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. బెల్జియం రాజ‌ధాని బ్రస్సెల్స్ పేలుళ్ల‌లో 35 మంది మృతి చెందగా, 200మందికి పైగా గాయపడ్డ విష‌యం తెలిసిందే. దాడులు జరిపిన సోదరులు పోలీసులు అరెస్ట్ చేసిన సలాహ్ అబ్దెస్లామ్ సన్నిహితులని మీడియాలో కథనాలు వచ్చాయి. వీరితో పాటు ఎయిర్ పోర్టు సీసీటీవీ కెమెరాల్లో కనిపించి మాయమైన మూడవ వ్యక్తి మోస్ట్ వాంటెడ్ బాంబ్ మేకర్ నిజ్జమ్ లాచ్రోయ్ అని పోలీసులు గుర్తించారు.

  • Loading...

More Telugu News