: ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక... నేడు, రేపు జాగ్రత్త!


ఉత్తర, పశ్చిమ ప్రాంతాల నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉష్ణ పవనాలు వీస్తున్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంగా తెలంగాణ, ఏపీల్లో ఎండలు ఇప్పటికే సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీలకు పైగా పెరిగాయని, వడగాలుల తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. కాగా, నేడు, రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరైతే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. నిన్న ఒక్కరోజులోనే తెలంగాణలో వడదెబ్బకు 10 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. కాగా, నిన్న పుట్టపర్తిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజనులో ఇదే అత్యధికం. మార్చిలో సాధారణంగా ఉష్ణోగ్రత 38 నుంచి 40 డిగ్రీలను మించదు. ఈ సంవత్సరం వాతావరణ మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వేడి 50 డిగ్రీలను దాటవచ్చని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News