: పాక్ మాజీ సైనికుడి నేతృత్వంలో భారత్ లోకి చొరబడిన ముష్కరమూక!
హోలీ పర్వదినం సందర్భంగా జనసమ్మర్ధమున్న ప్రాంతాల్లో ఉగ్రదాడి చేయాలన్న ఏకైక లక్ష్యంతో పాక్ నుంచి మాజీ సైనికుడు మహమ్మద్ ఖుర్షీద్ ఆలమ్ చొరబడ్డాడని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ మేరకు నైజీరియా అధికారుల నుంచి ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ)కి సమాచారం వచ్చింది. హోలీ నాడు ఇండియాపై దాడులు జరగవచ్చన్నది దీని సారాంశం. ఓ మాజీ సైనికుడి నేతృత్వంలో ఆరుగురు ఉగ్రవాదులు పంజాబ్ లోని పఠాన్ కోట్ సమీపంలో చొరబడ్డారని, ఆసుపత్రులు, హోటల్స్ వీరి లక్ష్యమని తెలుస్తోంది. దీంతో ఢిల్లీ, పంజాబ్, అసోం తదితర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు సోదాలు విస్తృతంగా జరుపుతున్నారు.