: అంతా అయిపోయిందని ఎప్పుడూ అనుకోవద్దు!: భారత్-బంగ్లా మ్యాచ్ పై మోదీ ట్వీట్
"అంతా అయిపోయిందని ఎప్పుడూ అనుకోవద్దు. జీవితం ఏ క్షణమైనా మలుపు తిరుగుతుంది. చివరి వరకూ పోరాడాలన్న ఆశే మనకు విజయాన్ని అందిస్తుంది. ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. నాకెంతో ఆనందం వేస్తోంది. బంగ్లాదేశ్ బాగా ఆడింది..." గత రాత్రి బంగ్లాదేశ్ తో జరిగిన టీ-20 క్రికెట్ పోటీలో ఆఖరి బంతికి భారత జట్టు విజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ఇది. మ్యాచ్ మొత్తం చూసిన మోదీ, భారత్ గెలవగానే ఈ ట్వీట్ చేశారు. ఇక సోషల్ మీడియా భారత్ కు అభినందనలతో మారుమోగిపోయింది. ఆట పూర్తికాకముందే సంబరాలకు దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్ల చిత్రాన్ని, దాని పక్కనే కూల్ గా వికెట్ల వెనుక కనిపిస్తున్న ధోనీని చూపుతూ కామెంట్ల మీద కామెంట్లు వచ్చాయి. అసలు ఇలాంటి మ్యాచ్ తానెప్పుడూ ఆడలేదని, అద్భుతమైన పోటీ తొలిసారిగా ఎదురైందని ఆట చివర్లో క్యాచ్ పట్టిన శిఖర్ ధావన్ వ్యాఖ్యానించగా, బంగ్లాదేశ్ కూడా అద్భుతంగా ఆడిందని రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.