: ఎస్పీవై రెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్... మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలింపు
నంది పైపుల సంస్థ అధినేత, నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం దాకా యాక్టివ్ గానే ఉన్న ఎస్పీవై... తన నియోజకవర్గ పరిధిలోని కోవెలకుంట్ల మండలం ఉండుట్ల గ్రామంలో ఓ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. సదరు కార్యక్రమం ముగించుకుని నిన్న సాయంత్రం నంద్యాలకు చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న కాసేపట్లోనే ఆయన కుప్పకూలారు. దాంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు పట్టణంలోని సురక్ష ఆసుపత్రికి తరలించారు. ఎస్పీవై రెడ్డికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాదుకు తరలించాలని సూచించారు. దీంతో ఓ ప్రత్యేకమైన అంబులెన్స్ లో ఆయనను నిన్న రాత్రి హైదరాబాదుకు తరలించారు. నంది పైపుల పేరిట ఓ సంస్థను స్థాపించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన ఎస్పీవై... మొన్నటి ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై నంద్యాల లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే రోజుల వ్యవధిలోనే ఆయన టీడీపీ వైపు మొగ్గి పలు విమర్శలు ఎదుర్కొన్నారు,