: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి అస్వస్థత
కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఒక ప్రైవేటు ఆసుపత్రికి ఆయనను తరలించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఎస్పీవై రెడ్డి తన పొలిటికల్ కెరీర్ ను బీజేపీతో ప్రారంభించారు. కడప జిల్లాలోని అంకలమ్మగూడూరు ఆయన స్వస్థలం. వరంగల్ లోని ఎన్ఐటీ లో ఆయన బి.టెక్, మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత ముంబయిలోని బాబా అటామిక్ రీసెర్చి సెంటర్ లో పనిచేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి వ్యాపార రంగంలోకి దిగారు.