: తెలంగాణ సర్కార్ కు ప్రధాని ప్రశంస
తెలంగాణ సర్కార్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈరోజు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఆయా ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం బాగా చొరవ చూపిందన్నారు. ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ ఆయా ప్రాజెక్టులకు అనుమతులు పొందుతున్నారని మోదీ ప్రశంసించారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరుపై కూడా ఆయన ఆరా తీశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ఆయా శాఖల సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.