: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తో ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సెమీస్ లో పాల్గొనే అవకాశాలు చేజారిపోకుండా ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్ లో గెలవడం తప్పనిసరి. ఇప్పటికే రెండు వరుస ఓటములతో ఉన్న ‘బంగ్లా’ క్రీడాకారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. కాగా, బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు టీమిండియా అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు.