: కన్నయ్యను చూసి ప్రభుత్వం భయపడుతోంది: సీపీఐ నారాయణ
జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్ ను చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని సీపీఐ నారాయణ విమర్శించారు. హెచ్సీయూలోకి కన్నయ్యను అనుమతించకపోవడంపై ఆయన మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏబీవీపీ ఏం చెబితే అదే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందంటూ నారాయణ ఆరోపించారు. కాగా, కన్నయ్య, రోహిత్ తల్లి రాధిక, సోదరుడితో పాటు నారాయణ కూడా హెచ్సీయూ వద్దకు వెళ్లారు. అక్కడ వారి వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వెనుతిరిగారు.