: లాఠీలతో కొట్టినా, ఆస్పత్రుల పాలు చేసినా మా గొంతు నొక్కలేరు: కన్నయ్య కుమార్
లాఠీలతో కొట్టినా, ఆస్పత్రుల పాలు చేసినా తమ గొంతు ఎవరూ నొక్కలేరని జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్ అన్నారు. హెచ్సీయూలోకి అనుమతించకపోవడంతో గేటు బయటే, కారులో నుంచే కన్నయ్య మాట్లాడాడు. ఈ ప్రభుత్వం విద్యార్థుల వేదన వినే పరిస్థితిలో లేదని, సామాజిక న్యాయం కలగానే ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము పోరాడాల్సిన అవసరం ఉందని అన్నాడు. సామాజిక న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, రోహిత్ చట్టం తీసుకురావాలి, రోహిత్ కలలను సాకారం చేద్దామని కన్నయ్య అన్నాడు. కాగా, కన్నయ్య వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో గేటు బయట నుంచే మాట్లాడిన కన్నయ్య వెనుతిరిగాడు. ఇక్కడి నుంచి సీపీఐ కార్యాలయానికి బయలుదేరి వెళుతున్నాడు.