: మీడియా సిబ్బందిని రోడ్డుపైనే నిలిపివేస్తున్న పోలీసులు


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్ సీయూ)లోకి మీడియాను కూడా పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్శిటీ వీసీ ఆదేశాల మేరకు బయటి విద్యార్థులను, మీడియాను, రాజకీయ నాయకులను లోపలికి అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు. మరోపక్క మీడియాపై వర్శిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. దీంతో వర్శిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ మీడియా ప్రతినిధులు ఆరోపించారు. కాగా, జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ హెచ్ సీయూకు మరికొద్ది సేపట్లో రానున్నాడు. యూనివర్శిటీలో ఆందోళనల నేపథ్యంలో ఇద్దరు టీచింగ్ ఫ్యాకల్టీతో పాటు 28 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి మియాపూర్ కోర్టులో హాజరుపరచడం, వారిని చర్లపల్లి జైలుకు తరలించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News