: హెచ్‌సీయూ వీసీగా ఉండే అర్హత అప్పారావుకి లేదు: కన్నయ్య
హెచ్‌సీయూ వీసీగా ఉండే అర్హత అప్పారావుకి లేదని ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ అన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావే కారణమని ఆరోపించారు. యూనివర్సిటీల్లో వివక్ష ఉండకూడదని మీడియా సమావేశంలో చెప్పారు. ఒక యూనివర్సిటీ విద్యార్థి వేరే యూనివర్సిటీకి వెళ్లవచ్చని అన్నారు. ఒక వేళ అలా వెళ్లకూడదన్న చట్టం ఉంటే దానిని తాను గౌరవిస్తానని చెప్పారు. మరోవైపు, యూనివర్సిటీ ఆందోళనల నేపథ్యంలో ఇద్దరు టీచింగ్ ఫ్యాకల్టీతో పాటు 28మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్ట్ చేసిన వారిని మియాపూర్ కోర్టులో హాజరుపరిచి చర్లపల్లి జైలుకి తరలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కన్నయ్యకు హెచ్‌సీయూలోకి అనుమతి నిరాకరించారు. హెచ్‌సీయూలో బయటి వ్యక్తులను నిరాకరిస్తూ వీసీ ఓ సర్కులర్ జారీ చేశారు.