: ఘనంగా 'చలాకీ' చంటి నిశ్చితార్థం


సినిమా, టీవీ నటుడు 'చలాకీ' చంటి నిశ్చితార్థం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని చంటి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపాడు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ కార్యక్రమం బాగా జరిగిందని పేర్కొన్నాడు. తన నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. కాగా, ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో చలాకీ చంటి విభిన్న పాత్రలను పోషించిన, తన హాస్యాభినయం ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.

  • Loading...

More Telugu News