: కన్నయ్య కుమార్ వస్తే అడ్డుకుని తీరుతాం: ఏబీవీపీ హెచ్చరిక


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోకి ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ ను రానిచ్చే ప్రసక్తే లేదని ఏబీవీపీ హెచ్చరించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉన్న భారత్ లో కన్నయ్య ఎక్కడైనా ఏమైనా మాట్లాడుకోవచ్చని, యూనివర్శిటీ గేటు బయట వరకే అతనికి అనుమతి ఉంటుందని, లోనికి మాత్రం రానివ్వబోమని ఏబీవీపీ నేత గురిజాడ వ్యాఖ్యానించాడు. దేశం పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టం చర్యలు తీసుకుంటుందని అన్న ఆయన, క్యాంపస్ లో రాజకీయాలను మాత్రం తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఏబీవీపీతో పాటు సాధారణ విద్యార్థులు సైతం కన్నయ్య రాకను వ్యతిరేకిస్తున్నారని, సెమిస్టర్ పరీక్షలు దగ్గర పడుతున్న వేళ, విద్యార్థుల చదువులపై ప్రభావం చూపే కార్యక్రమాలు తగదని, రోజూ ఏదో ఒక వంకతో గొడవలు రేపుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించాడు.

  • Loading...

More Telugu News