: చెన్నై వరద బాధితులకు ఇళ్లు నిర్మిస్తున్న బాలీవుడ్ నటి


బాలీవుడ్ నటి జాక్వెలీన్ ఫెర్నాండజ్ తన దాతృత్వాన్ని చాటుకుంది. గత ఏడాది చివరిలో కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరం తీవ్రంగా నష్టపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదల కారణగా చాలామంది ఇళ్లను కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చెన్నై వరద బాధితులలో కొంతమందికి జాక్వెలీన్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలనుకుంది. తన వంతు సాయంగా ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు గాను 'జాక్వెలీన్ బిల్డ్స్' ని ప్రారంభించనుంది. ఇందుకుగాను ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి విరాళాలు సేకరించడం ప్రారంభించింది. వాళ్లకు పానాబాయ్ అంతర్జాతీయ పాఠశాల విద్యార్థులు కూడా సహకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News