: ఎస్సై ఉద్యోగాలు, మెడికల్ సీట్ల పేరిట టోకరా, నిందితుడి అరెస్ట్


ఎస్సై ఉద్యోగాలు, మెడికల్ సీట్లు ఇప్పిస్తానని చెబుతూ నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేస్తున్న వినయ్ గుప్తా అనే వ్యక్తిని హైదరాబాదు శివారు మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, తెలంగాణలో ఎస్సై ఉద్యోగాలు, తమిళనాడు రాష్ట్రంలో మెడికల్ సీట్లు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పే వినయ్ గుప్తా పలువురు వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని చెప్పారు. నిందితుడి నుంచి ఖాళీ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News