: ఇంగ్లండ్ ను ఆడుకుంటున్న ఆఫ్గనిస్థాన్... 50 పరుగులకే 5 వికెట్లు ఫట్!
న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో వరల్డ్ కప్ టీ-20లో భాగంగా ఇంగ్లండ్, ఆఫ్గనిస్థాన్ మధ్య జరుగుతున్న పోరులో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో మునిగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా, 8 ఓవర్లలోనే కీలకమైన ఐదు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు రాయ్ 5, విన్సీ 22 పరుగులకు అవుట్ కాగా, స్టార్ బ్యాట్స్ మన్ రూట్ 12 పరుగులకు, కెప్టెన్ మోర్గాన్ 0 పరుగులకు, బుట్లర్ 6 పరుగులకు అవుటై పెవీలియన్ దారి పట్టారు. ఆఫ్గన్ బౌలర్ మహ్మద్ నబీకి రెండు వికెట్లు దక్కగా, అమీర్ హమ్జాకు రాయ్ వికెట్ లభించింది. ఈ మ్యాచ్ లో గెలవాలన్న పట్టుదలతో ఇంగ్లండ్ ఉండగా, గెలిచి తామూ నాకౌట్ రౌండ్ కు పోటీలో ఉన్నామని నిరూపించాలని ఆఫ్గన్ భావిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 8.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 50 పరుగులు.