: 2 కోట్లకు చేరిన బిగ్ బీ ట్విట్టర్ ఫాలోవర్స్
బాలీవుడ్ స్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్‌లో కింగ్ అనిపించుకున్నారు. ట్విట్టర్‌లో బాలీవుడ్ మెగాస్టార్ ఫాలోవర్ల సంఖ్య 2 కోట్లకు చేరుకుంది. దీంతో ట్విట్టర్‌లో సెలబ్రిటీల విభాగంలో అమితాబ్ టాప్‌గా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ట్విట్టర్‌లో 18.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా తన ఫాలోవర్ల సంఖ్య 2 కోట్లకు చేరుకోవడంతో బిగ్‌బీ ప్రధాని మోదీని దాటేశారు. ఈ అంశంపై అమితాబ్ స్పందిస్తూ... "థాంక్యూ ఆల్.. ఇక 30 మిలియన్ల వైపు వెళ్లాలి.. మీ సమయం వచ్చింది"... అని ట్వీట్ చేశారు. అమితాబ్ బచ్చన్ కాలానికి అనుగుణంగా అప్ డేట్ అవుతుంటారు. అనేక విషయాలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటారు. దీంతో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 2కోట్లకు చేరింది.