: బ్యాంకుల సమ్మెపై తలోదారి... విషయం తెలీక ప్రజల అయోమయం!


"మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే తదుపరి వారంలో బ్యాంకులన్నీ యథావిథిగా పనిచేస్తాయి" బ్యాంకు యూనియన్లు చెబుతున్న మాటిది. "ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల అమ్మకానికి నిరసనగా 28 నుంచి నాలుగు రోజుల సమ్మెకు దిగుతున్నాం" ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సంఘం చేసిన ప్రకటన. ఐడీబీఐ ఉద్యోగుల సమ్మెకు తాము మద్దతిస్తున్నట్టు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యునీయోమ్ (యూఎఫ్బీయూ) కన్వీనర్ ఎంవీ మురళి తెలిపారు. ఐడీబీఐ బ్యాంకులో 80 శాతం వాటా ఉన్న కేంద్రం దాన్ని 50 శాతానికి తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు వచ్చిన వార్తలపై బ్యాంకు సంఘాలు మండిపడుతున్నాయి. ఇదిలావుండగా, నాలుగో శనివారమైనప్పటికీ, 26వ తేదీన తమ బ్యాంకులు పనిచేస్తాయని ఐడీబీఐ (క్లియరెన్స్ సేవలు మినహా) తమ ఖాతాదారులకు సమాచారాన్ని పంపింది. ఇక సోషల్ మీడియా, వాట్స్ యాప్ తదితర మాధ్యమాల ద్వారా 31 వరకూ బ్యాంకులు పనిచేయబోవని ప్రచారం జరుగుతోంది. అసలే రేపటి నుంచి నాలుగు రోజుల పాటు అత్యధిక బ్యాంకులకు సెలవులు ఉండటం, ఆపై ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె వార్తలతో ప్రజలు వాస్తవం తెలియక అయోమయంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News