: సెంట్రల్ వర్శిటీ వద్ద కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అరెస్ట్
కాంగ్రెస్ నేత, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఎన్ఎస్యూఐ సంఘానికి నేతగా పనిచేసిన ఆయన, వర్శిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆపై ఆయన్ను రాయదుర్గం పోలీసు స్టేషన్ కు తరలించారు. కాగా, నిన్న వర్శిటీ వీసీగా అప్పారావు బాధ్యతలను తిరిగి స్వీకరించిన తరువాత గొడవలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఉదయం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావును సైతం వర్శిటీలోకి అనుమతించ లేదు. హెచ్సీయూ వద్ద ఉద్రిక్తత నెలకొని ఉండటంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.