: మాల్యాకు రుణాలివ్వాలని రాజకీయ నేతల ఒత్తిడి!


మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ సంస్థకు నెగటివ్ క్రెడిట్ రేటింగ్ ఉన్నప్పటికీ, రుణాలివ్వాలని ఐడీబీఐ బ్యాంకు ఉన్నతాధికారులకు రాజకీయ నేతల నుంచి ఒత్తిడి వచ్చిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. బ్యాంకు మాజీ చీఫ్ యోగేష్ అగర్వాల్ ను పలుమార్లు విచారించిన అనంతరం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే 2009లో ఆయనకు రూ. 950 కోట్ల రుణం మంజూరైందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. రుణం కోరుతూ దరఖాస్తు పెట్టిన 20 రోజుల్లోనే ఆయనకు లోన్ మంజూరైందని కూడా అధికారులు గుర్తించారు. ఇక అప్పట్లో ఆయనకు గట్టి సిఫార్సులు చేసినట్టు భావిస్తున్న రాజకీయ నేతలనూ ప్రశ్నించనున్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News