: మెట్రో రైలుకు భద్రత కల్పించేందుకు కోట్ల రూపాయలు అడుగుతున్న తెలంగాణ పోలీసులు!


త్వరలో తొలిదశ సేవలు ప్రారంభం కానున్న హైదరాబాద్ మెట్రో రైల్ కారిడార్ కు భద్రతను కల్పించేందుకు తెలంగాణ పోలీసులు వేస్తున్న సెక్యూరిటీ బిల్లు ఎంతో తెలుసా?... సంవత్సరానికి రూ. 54 కోట్లు. ఇద్దరు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, 1,525 మంది పోలీసులను భద్రత నిమిత్తం నియమించాల్సి వుందని, అందుకోసం ఈ మొత్తం చెల్లించాలని డీజీపీ అనురాగ్ శర్మ మెట్రో అధికారులతో జరిపిన చర్చల సందర్భంగా వెల్లడించినట్టు తెలుస్తోంది. మొత్తం 72 కిలోమీటర్ల దూరం ఉండే రైల్వే ట్రాక్ లో మెట్రో స్టేషన్లు, లోపలికి, బయటకు వెళ్లేదారులు, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో పోలీసులను నియమించాల్సి వుందని ఆయన వివరించారు. మెట్రోకు సంబంధించిన కేసులను విచారించేందుకు ఓ ప్రత్యేక కోర్టును సైతం ఏర్పాటు చేయాల్సి వుందని, ప్రతి 22 మెట్రో స్టేషన్లకు ఓ ప్రత్యేక పోలీసు స్టేషన్ (మొత్తం 66 మెట్రో స్టేషన్లుండగా పంజాగుట్ట, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్) ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ స్టేషన్లలో ఓ ఎస్ఐ, ఓ హెడ్ కానిస్టేబుల్ తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు, ఓ మహిళా కానిస్టేబుల్ ఉంటారని వివరించారు.

  • Loading...

More Telugu News