: శంషాబాదు చేరుకున్న కన్నయ్య... స్వాగతం పలికిన సీపీఐ నారాయణ
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ యూనియన్ నేత కన్నయ్య కుమార్ కొద్దిసేపటి క్రితం శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నేటి ఉదయం విమానంలో బయలుదేరి శంషాబాదు ఎయిర్ పోర్టులో దిగిన కన్నయ్యకు సీపీఐ అగ్రనేతలు కె.నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడిన కన్నయ్య... రోహిత్ వేముల తల్లి దీక్షకు సంఘీభావం తెలిపేందుకే హైదరాబాదు వచ్చానన్నారు. రోహిత్ పేరిట చట్టం తెచ్చేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన ప్రకటించారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే తాను హెచ్ సీయూకు వెళుతున్నానని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.