: ఎండీఎంకే, వీసీకేతో డీఎండీకే పొత్తు... ముఖ్యమంత్రి అభ్యర్థి విజయకాంత్


తమిళనాట ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే (డ్రవిడ మున్నేట్ర కజగం) తో, నటుడు విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం) పొత్తు కుదుర్చుకోవచ్చన్న అంచనాలు పటాపంచలయ్యాయి. వైకో నేతృత్వంలోని ఎండీఎంకే (మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం), చెన్నై న్యాయవాది తిరుమలవన్ నడుపుతున్న వీసీకే (విదుత్తలయ్ చిరుత్తైగల్ కట్చి) పార్టీలతో కలసి తాము పోటీ చేస్తున్నట్టు డీఎండీకే స్పష్టం చేసింది. మొత్తం 124 సీట్లకు తాము పోటీ చేయనున్నామని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ ఉంటారని ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మిగతా సీట్లను పొత్తులోని ఇతర పార్టీలకు పంచుతామని పేర్కొంది.

  • Loading...

More Telugu News