: ముంబై 26/11 దాడుల కేసులో డేవిడ్ హెడ్లీని విచారిస్తున్న ముంబయి కోర్టు
ముంబై 26/11 దాడులకు సంబంధించి పాక్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీని ముంబయి కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తోంది. ఈ విచారణ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. విచారణలో భాగంగా డేవిడ్హెడ్లీ తన భార్యను గురించి కూడా ప్రశ్నలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై హెడ్లీ కేవలం తన గురించే ప్రశ్నలు అడగాలని కోరినట్లు సమాచారం. ముంబయి దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ హెడ్లీ గతంలో న్యాయస్థానం ముందు కొన్ని విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ముంబై ఎయిర్‌పోర్ట్‌ను టార్గెట్ చేసిందని చెప్పాడు. ముంబై దాడుల్లో పట్టుబడి ఉరిశిక్షకు గురైన అజ్మల్ కసబ్‌ను కూడా హెడ్లీ గుర్తించాడు.