: నెల్లూరుకు జగన్, మరికాసేపట్లో ఆనం విజయకుమార్ వైకాపాలోకి!
కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి మారిపోయిన ఆనం వివేకానందరెడ్డి సోదరుడు ఆనం విజయకుమార్ రెడ్డి వైకాపాలో చేరేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్, అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్ లో జరిగే కార్యక్రమంలో ఆనం విజయకుమార్, ఆయన అనుచరులను జగన్ స్వయంగా పార్టీలోకి స్వాగతం పలకనున్నారు. ఆపై మాగుంట లేఅవుట్ లో నిర్మించిన వైకాపా నూతన కార్యాలయాన్ని జగన్ ప్రారంభిస్తారని, ఆపై పార్టీ నేతలతో సమావేశమై, సాయంత్రం రేణిగుంట నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.