: పోలీసాఫీసర్ పై వాట్సాప్ లో ఘాటు వ్యాఖ్యలు... ఛత్తీస్ గఢ్ లో జర్నలిస్ట్ అరెస్ట్


మావోయిస్టుల దాడులతో అట్టుడుకుతున్న ఛత్తీస్ గఢ్ లో జర్నలిస్టుల అరెస్టులకు తెర లేచింది. ఇప్పటికే మావోయిస్టులతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు... తాజాగా సోమవారం వేరే కారణంపై మరో జర్నలిస్టును కటకటాల వెనక్కు నెట్టారు. అయినా ఆ జర్నలిస్టు చేసిన నేరమేంటంటే... ఓ పోలీసు అధికారి వ్యవహార సరళిని ప్రశ్నిస్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ వాట్సాప్ లో మెసేజ్ పోస్ట్ చేయడమేనట. పోలీసు అధికారిని ‘మామ’ అంటూ పేర్కొనడమే కాక, ఆయనతో మమేకమయ్యే వారు జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్టు కింద ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని జగదల్ పూర్ కు చెందిన ప్రభాత్ సింగ్ అనే జర్నలిస్టు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఆయనను సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 31 దాకా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News