: ప్రపంచ మేటి సీఈఓల జాబితాలో ఇద్దరు ఇండియన్స్!... ఓ ఎన్నారైకీ చోటు


ప్రపంచంలో అత్యుత్తమ సీఈఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) ఎవరంటూ ‘బారెన్స్’ అనే అంతర్జాతీయ సంస్థ సర్వే చేయగా, భారతీయుల్లోనూ సత్తా కలిగిన సీఈఓలు ఉన్నారని తేలింది. విశ్వవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్లలో పనిచేస్తున్న సీఈఓల్లో 30 మందిని ఆ సంస్థ ‘అత్యుత్తమ సీఈఓ’లుగా తేల్చింది. ఈ జాబితాలో ముగ్గురు భారతీయులకు చోటు లభించింది. వీరిలో ఇద్దరు భారత్ లోనే వ్యాపార కార్యకాపాలు సాగిస్తుండగా, మరొకరు ఎన్నారైగా మారి విదేశాల్లో సత్తా చాటుతున్నారు. భారత్ లో ఉన్న ఈ మేటి సీఈఓల్లో ఒకరు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు సీఈఓ ఆనంద్ మహీంద్రా కాగా, మరొకరు ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ డీఎఫ్ సీ సీఈఓ ఆదిత్య పూరి. ఇక ప్రవాస భారతీయుడిగా సత్తా చాటుతున్న సీఈఓగా అమెరికా టెక్ దిగ్గజం ‘అబోడ్’ సీఈఓ శంతన్ నారాయణ్ ఎంపికయ్యారు.

  • Loading...

More Telugu News