: భరణం కోరిన భార్యకు ఉద్యోగం చేసుకోవాలని సలహా ఇచ్చిన మహిళా న్యాయమూర్తి
"నీ భర్త కంటే బాగా చదువుకున్నావు. ఉద్యోగం చేయగలవు. ఇక నీకు భరణం ఎందుకు? భర్త మీద ఎందుకు భారం మోపాలనుకుంటున్నావు? ఏదైనా ఉద్యోగం చూసుకో. కావాలంటే ఉద్యోగం పొందేందుకు ఆయన సహకారం తీసుకో" అని ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి రేఖా రాణి ఓ మహిళకు సలహా ఇచ్చారు. ఉద్యోగం సంపాదించుకునేంత వరకూ ఆమె ఖర్చుల నిమిత్తం నెలకు రూ. 12 వేల చొప్పున ఏడాది పాటు చెల్లించాలని భర్తను ఆదేశించారు. అంతకుముందు ఈ జంటకు విడాకులు మంజూరు కాగా, ఆమె తనకు భరణం ఇప్పించాలని డిమాండ్ చేసింది. దీంతో కోర్టు ఉద్యోగం చేసుకోవాలని సలహా ఇవ్వగా, ఉద్యోగం వచ్చేంత వరకూ భర్త తనతో పాటు తిరగాలని కోరింది. ఈ అభ్యర్థనకు అంగీకరించని న్యాయమూర్తి, ఇక్కడికి ఒంటరిగా వచ్చినదానివి, ఇంటర్వ్యూకు ఎందుకు వెళ్లలేవని ప్రశ్నించారు. మాజీ భర్తకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ పంపి సాయం తీసుకోవచ్చని తెలిపారు.