: ఓయూలో హైటెన్షన్!... వాటర్ ట్యాంకులో పడి యువకుడి మృతి, గుమిగూడుతున్న విద్యార్థులు


నిత్యం ఉద్రిక్త వాతావరణానికి కేంద్ర బిందువుగా మారుతున్న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేటి ఉదయం మరోమారు హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. వర్సిటీలోని వాటర్ ట్యాంకులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాటర్ ట్యాంకులో పడి ఉన్న సదరు యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ తర్వాత అతడు మాణికేశ్వరి నగర్ కు చెందిన ప్రసాద్ గా గుర్తించారు. యువకుడు ఏ కారణంగా చనిపోయాడన్న విషయం తెలియరాలేదు. దీనిపై వర్సిటీలో కలకలం రేగింది. యువకుడి మృతదేహం వద్దకు చేరుకుంటున్న ఓయూ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో పరిస్థితి అదుపులోనే ఉంచేందుకంటూ పోలీసులు కూడా భారీ సంఖ్యలో అక్కడ మోహరించారు. ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News