: తిరుమలలో అపచారం!... వెంకన్న కొండపై ‘ప్రైవేట్’ యాగం!
తిరుమల వెంకన్న కొండపై నిన్న అపచారం జరిగిపోయింది. కొండపైకి వచ్చిన ఓ బాబా... వెంకన్న సేవను పక్కనబెట్టి ప్రైవేట్ యాగ నిర్వహణలో మునిగిపోయారు. అయితే ఇలాంటి వ్యవహారాలపై నిఘా వేయాల్సిన విజిలెన్స్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో పెద్ద దుమారాన్నే రేపనుంది. వివరాల్లోకెళితే... వెంకన్న సేవకంటూ బర్శీ బాబాగా ప్రసిద్ధి చెందిన ఓ బాబా నిన్న కొండపైకి చేరుకున్నారు. అయితే వెంకన్న సేవకు అంతగా ప్రాధాన్యమివ్వని బర్శీ బాబా... శ్రీవారి కుటీర్ లో ప్రైవేట్ యాగాన్ని నిర్వహించారు. దీనిపై ముందుగానే సమాచారం ఉన్నా, విజిలెన్స్ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.