: కేబినెట్ రీషఫిలింగ్ దిశగా కేజ్రీ అడుగులు!...ఇద్దరు మంత్రులపై వేటు తప్పదట!


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా శాఖ మినహా మిగిలిన మంత్రుల శాఖలన్నీ కూడా మారిపోనున్నాయట. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానాలను కూడా మార్చేందుకు కేజ్రీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ గా ఉన్న రామ్ నివాస్ గోయల్ కు కేబినెట్ బెర్తు దక్కనుంది. డిప్యూటీ స్పీకర్ గా ఉన్న బందన కుమారి స్పీకర్ పోస్టుకు ప్రమోట్ కానున్నారు. రీషఫిలింగ్ లో భాగంగా కనీసం ఇద్దరు మంత్రులపై వేటు పడటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. వేటు పడనున్న వారిలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ ముందు వరుసలో ఉన్నారు. ఓ వేడుకకు సంబంధించిన శిలా ఫలకంపై తన భార్య పేరు లేదంటూ ఓ పాఠశాల ప్రిన్సిపల్ పై ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందీప్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ కారణంగానే ఆయనను తన కేబినెట్ నుంచి తప్పించేందుకు కేజ్రీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని వినికిడి.

  • Loading...

More Telugu News