: షూటింగ్ లో ఆదిత్యారాయ్ కపూర్ కి గాయాలు
బాలీవుడ్ యువనటుడు ఆదిత్యారాయ్ కపూర్ షూటింగ్ లో గాయపడ్డాడు. 'ఆషికీ2' సినిమాతో బాలీవుడ్ ప్రేమ జంటగా ముద్రపడిన ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ మరోసారి జంటగా 'ఓకే జాను' సినిమాలో నటిస్తున్నారు. మణిరత్నం తెలుగు, తమిళభాషల్లో రూపొందించిన 'ఓకే బంగారం' సినిమాకు పలు మార్పులు చేర్పులు చేసి 'ఓకే జాను'గా షాద్ అలీ దర్శకత్వంలో దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా కిందపడ్డ ఆదిత్యరాయ్ కపూర్ నడుమునొప్పితో విలవిల్లాడాడు. దీంతో షూటింగ్ నిలిపివేసి అతనిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.