: చెలరేగిన షెర్జిల్ ఖాన్...నాలుగు ఓవర్లలో పాక్ 51
పాకిస్థాన్ క్రికెటర్ షెర్జిల్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. మొహాలీ పిచ్ పై న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 181 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాక్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా షెర్జిల్ ఖాన్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గుడ్ లెంగ్త్, షార్ట్ పిచ్, యార్కర్, స్వింగర్ ఇలా ఏ బంతిని సంధించినా బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీంతో పాకిస్థాన్ జట్టు కేవలం నాలుగు ఓవర్లలోనే అర్ధసెంచరీ మార్కు చేరుకుంది. ఏడు బంతులాడిన అహ్మద్ షెహజాద్ కేవలం 7 పరుగులు మాత్రమే చేయగా, మరో ఎండ్ లో ఉన్న షెర్జిల్ ఖాన్ ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ తో కేవలం 22 బంతుల్లో 43 పరుగులు చేశాడు. షెర్జిల్ ధాటికి కివీస్ బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు.