: నానితో నటించాలని ఉంది: తమన్నా
ఈ నెల 25న తెలుగు, తమిళభాషల్లో విడుదల కానున్న 'ఊపిరి' సినిమా ప్రమోషన్ లో నటవర్గం తలమునకలై ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నా మాట్లాడుతూ, తెలుగు తమిళ భాషల్లో అగ్రహీరోలందరితోనూ పని చేశానని చెప్పింది. అయితే అవకాశం వస్తే నటుడు నానితో నటించాలని ఉందని అభిలాష వ్యక్తం చేసింది. సహజనటుడిగా తెలుగు యువనటుల్లో నానికి మంచి గుర్తింపు ఉంది. అదే సమయంలో నాని వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటాడన్న పేరు కూడా ఉంది. నాని నటించిన సినిమాలు చూస్తే వాటిల్లో నానితో పాటు హీరోయిన్ కు కూడా ఎంతో గుర్తింపు ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తమన్నాకు కొత్తగా గుర్తింపు అవసరం లేకపోయినప్పటికీ, అగ్రహీరోలతో అభినయం ప్రదర్శించే అవకాశం మాత్రం ఆమెకు పెద్దగా లభించినట్టు అనిపించినట్టు లేదు. అందుకే నాని సరసన నటించాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది.