: రాణించిన గుప్తిల్...న్యూజిలాండ్ 93/2
మొహాలీ వేదికగా పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రెండు జట్లు హోరాహోరీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. గుప్తిల్ (61) ధాటిగా బ్యాటింగ్ చేయగా, విలియమ్సన్ (17) ఆచితూచి ఆడాడు. మహ్మద్ ఇర్ఫాన్ వేసిన బంతిని మిడ్ ఆఫ్ మీదుగా తరలించే ప్రయత్నం చేసి అఫ్రిదికి దొరికిపోయాడు. అనంతరం వచ్చిన మున్రో (7)ను అఫ్రిది అవుట్ చేశాడు. దీంతో కివీస్ దూకుడు తగ్గింది. గుప్తిల్ కు కోరె ఆండర్సన్ జతకలిశాడు. సహచరులు వెనుదిరుగుతున్నా జోరు తగ్గించని గుప్తిల్ అర్ధ సెంచరీ సాధించి ధాటిగా ఆడుతున్నాడు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ స్కోరు 93 పరుగులు.