: పేలుళ్లకు వెరవని మోదీ... బెల్జియం పర్యటన యథాతథం!


ధైర్యంగా అడుగేయడంలో ప్రధాని మోదీ శైలి వేరు. ఈ నెల 30 న ఆయన బెల్జియం పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఈ రోజు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో విమానాశ్రయం, మెట్రోస్టేషన్లలో బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడంతో ప్రధాని పర్యటన రద్దవుతుందని చాలా మంది ఊహించారు. అయితే, తన పర్యటన షెడ్యూల్ మార్చేది లేదని ప్రధాని తేల్చారు. యూరోపియన్ యూనియన్ లో భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని చెప్పిన మోదీ, భారత్-యూరోపియన్ యూనియన్ సదస్సు రద్దు చేసే ఆలోచన లేదని తేల్చారు. దీంతో ప్రధాని పర్యటన యథాతథంగా కొనసాగుతుందని పీఎంవో ప్రకటించింది. 30న బెల్జియం పర్యటన ముగించుకుని ప్రధాని ఈ నెల 31న అమెరికా చేరనున్నారు. అక్కడ జరగనున్న అణుభద్రత సదస్సులో పాల్గొని ఏప్రిల్ 2న సౌదీ అరేబియాలోని రియాద్ వెళతారు.

  • Loading...

More Telugu News