: ఐశ్వర్యారాయ్ చేత కంటతడి పెట్టించిన కూతురి ప్రేమ!
కూతుర్ని చూసుకుని అందాలతార ఐశ్వర్యారాయ్ ఇప్పుడు తెగమురిసిపోతోంది. 'నా బంగారుతల్లికి నేనంటే ఎంత ప్రేమో!' అంటూ ఆనందబాష్పాలు కూడా రాల్చింది. ఆ వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం 'సరబ్ జీత్' సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఐశ్వర్యారాయ్ గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. అయినప్పటికీ కూతురు ఆరాధ్యను స్కూల్ నుంచి పికప్ చేసుకోవడం మాత్రం మానలేదు. రెండు రోజులుగా తల్లి అనారోగ్యంతో బాధపడడం గమనించిన ఆరాధ్య స్కూల్ లో విరామ సమయంలో 'గెట్ వెల్ సూన్' అంటూ ఓ చిన్న గ్రీటింగ్ కార్డును తయారు చేసింది. తరువాత తల్లి తనను ఎప్పట్లా స్కూల్ నుంచి తీసుకెళ్లేందుకు వచ్చిన సమయంలో ఆ గ్రీటింగ్ ఇచ్చింది. దీనిని చూసిన ఐశ్వర్యారాయ్ మురిసిపోయి, కూతుర్ని గుండెలకు హత్తుకుని, ఆనందబాష్పాలు రాల్చింది.