: చిరు, బాలయ్య, వెంకీ, నేను ఆ స్థాయిని ఎప్పుడో దాటేశాం: నాగార్జున


తమ నలుగురం తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ గేమ్ స్థాయిని ఎప్పుడో దాటేశామని ప్రముఖ నటుడు నాగార్జున తెలిపారు. 'ఊపిరి' సినిమా ప్రమోషన్ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, తాను నటులుగా ఎప్పుడో నిరూపించుకున్నామని అన్నారు. తమకు ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. తమకు స్టాండర్డ్ ఫ్యాన్స్ ఉన్నారని, వారిని తమ సినిమాలు మెప్పిస్తాయని నాగార్జున చెప్పారు. బలమైన కథ ఉంటే అభిమానులు ఎప్పుడూ ఆదరిస్తారని నాగార్జున పేర్కొన్నారు. ఓ ఫ్రెంచ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న 'ఊపిరి' సినిమాలో తన పాత్ర నచ్చిన తరువాతే అంగీకరించానని అన్నారు. రొమాన్స్, యాక్షన్ సినిమాలు ఎప్పుడూ చేసేవేనని చెప్పిన నాగార్జున, ఇలాంటి సినిమాల్లో నటించడం ఛాలెంజ్ అని అన్నారు. ఈ సినిమా అభిమానులను అలరిస్తుందన్న విశ్వాసం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News