: టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన భారత్ మహిళల జట్టు
భారత మహిళా క్రికెట్ జట్టు టీట్వంటీ వరల్డ్ కప్ లో వరుస ఓటములతో నిష్క్రమించింది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన భారత మహిళా క్రికెట్ జట్టు నేడు ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో చతికిలపడింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత మహిళా జట్టు ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కేవలం 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 91 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి జయకేతనం ఎగురవేశారు. రెండు మ్యాచ్ లలో ఓడిన భారతజట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.