: బ్రస్సెల్స్ లో జంట పేలుళ్లకు పాల్పడింది మేమే: ఐఎస్ఐఎస్
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్ లో జంట పేలుళ్లకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. ఈరోజు ఉదయం జావెంటమ్ ఎయిర్ పోర్ట్ లోని డిపార్చర్ లాంజ్ వద్ద బాంబులు పేలిన ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొంత మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన అనంతరం అక్కడి ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయం పరిసర ప్రాంతాలకు ప్రజలు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బ్రస్సెల్స్ లో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మధ్య సరిహద్దులను మూసివేశారు.