: కోహ్లీని 'లవర్' గురించి అడిగిన పాక్ ముద్దుగుమ్మ!


టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై గెలిస్తే స్ట్రిప్ డ్యాన్స్ చేస్తానని ప్రకటించి సంచలనం రేపిన పాకిస్థాన్ ముద్దుగుమ్మ క్వండిల్ బలోచ్ కొత్తపల్లవి అందుకుంది. భారత్ చేతిలో ఓటమిపాలైన పాక్ జట్టును తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టింది. ఆవేశం చల్లారిన తరువాత 'అఫ్రిదీ బేబీ, నువ్వే నా లవర్' అంటూ గారాలుపోయింది. తాజాగా మనసు మార్చుకుందేమో, విరాట్ కోహ్లీకి ఓ ట్వీట్ ఇచ్చింది. 'విరాట్ బేబీ, ఇంకా నీ జీవితంలో అనుష్కా శర్మ ఉందా?' అని అడిగింది. ఇప్పుడిప్పుడే బ్రేకప్ నుంచి కోలుకుని, తెగిన బంధం కలుపుకునే దిశగా స్పందిస్తున్న కోహ్లీ దీనికి ఏమంటాడో చూడాలి.

  • Loading...

More Telugu News