: హిందూపురం వాసులకు వడ్డీ, అపరాధ రుసుం సడలించండి: మంత్రి నారాయణకు ఎమ్మెల్యే బాలకృష్ణ లేఖ


హిందూపురం మునిసిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లలో వడ్డీ, అపరాధ రుసుం సడలించాలని ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణకు ఎమ్మెల్యే బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక లేఖ రాశారు. హిందూపురం మునిసిపాలిటీకి రావాల్సిన పన్ను బకాయిల వసూలు నిమిత్తం అధికారులు రంగంలోకి దిగి నెలరోజులవుతోందని, పన్ను బకాయిలు చెల్లించాలంటూ ప్రజలపై వారు ఒత్తిడి చేస్తున్నారన్న విషయాన్ని బాలకృష్ణ మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో ఈ విషయమై ఆయన ఆరా తీయగా, పన్నుల కంటే వడ్డీ, అపరాధ రుసుమే ఎక్కువగా వున్నాయని, అందువల్లే ప్రజలు పన్ను చెల్లించలేకపోతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణకు బాలకృష్ణ లేఖ రాశారు. పన్నులపై వడ్డీ, అపరాధ రుసుం లేకుండా చేస్తే పన్నులు చెల్లించేందుకు ప్రజలు ముందుకు వస్తారని ఆ లేఖలో ఆయన కోరారు.

  • Loading...

More Telugu News