: దహనానికి సిద్ధంగా మాల్యా భారీ దిష్టిబొమ్మ!


బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయిపడి, దేశం విడిచి పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా భారీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ముంబయి వాసులు సిద్ధమవుతున్నారు. ముంబయిలోని బీడీడీ చాల్ ప్రాంత వాసులు 50 అడుగుల దిష్టిబొమ్మను తయారు చేశారు. ఈ నెల 24వ తేదీన హోలీ పండగను పురస్కరించుకుని మాల్యా దిష్టి బొమ్మను దహనం చేయనున్నారు. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పారిపోయిన మాల్యాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, విమానంపై మాల్యా కూర్చున్నట్టుగా తయారు చేసిన ఈ దిష్టి బొమ్మను దహనం చేసి వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేస్తామని బీడీడీ చాల్ ప్రాంత వాసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News