: సోషల్ మీడియాతో తనకు సంబంధం లేదంటున్న స్టార్ క్రికెటర్


టీమిండియా స్టార్ ఆటగాడు ఆశిష్ నెహ్రా తనకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రాం వంటి సోషల్ మీడియా దేనిలోనూ ఖాతా లేదని చెప్పడంతో మీడియా షాక్ కు గురైంది. ఆశిష్ నెహ్రాకు ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పేస్తాడనే పేరుంది. అలాంటి నెహ్రాను సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ తో రేగిన ముఖాల మార్ఫింగ్ వివాదంపై ఎలా స్పందిస్తారని మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానమిస్తూ, మీరు రాంగ్ పర్సన్ ను ఈ ప్రశ్న అడిగారని అన్నాడు. తాను సోషల్ మీడియా ఫాలో కానని, తనకసలు సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతాలు లేవని చెప్పాడు. అంతెందుకు, తాను కనీసం పేపర్ కూడా చదవనని తెలిపాడు. తన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ కూడా లేదని, బేసిక్ మోడల్ ఫోన్ నే తాను వాడుతానని చెప్పి నెహ్రా మీడియా ప్రతినిధులకు షాకిచ్చాడు. అయితే టీట్వంటీ ఫార్మాట్ లో బంగ్లాదేశ్ జట్టు బాగా ఆడుతుందని చెప్పాడు.

  • Loading...

More Telugu News