: పాకిస్థాన్‌లో హోలీ సంబ‌రాల్లో విషాదం... క‌ల్తీమ‌ద్యం సేవించిన 24 మంది హిందువుల మృతి


పాకిస్థాన్‌లోని సింధ్‌ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. అక్క‌డ‌ కల్తీ మద్యం సేవించి 24మంది హిందువులు చ‌నిపోయారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. హోలీ సంబ‌రాల్లో మునిగిన‌ పాక్‌లోని హైదరాబాద్‌లో నివసించే 35 మంది హిందువులు కల్తీ మద్యం సేవించారు. దీంతో అనారోగ్యానికి గురవడంతో వెంట‌నే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో 24 మంది మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై అధికారులు ఏరియా స్టేషన్‌ హౌస్‌ అధికారిని సస్పెండ్ చేసి, కల్తీ మద్యం అమ్మకాలు జరిపిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News