: అమెరికా అప్రమత్తంగా ఉండాలంటున్న డొనాల్డ్ ట్రంప్
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ ఒకప్పుడు చాలా అందమైన, సురక్షిత నగరమని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అలాంటి సురక్షిత నగరంలో బాంబుపేలుళ్లు జరగడంతో భయానక వాతావరణం నెలకొందని ఆయన తెలిపారు. బెల్జియంలో ఉగ్రదాడుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, బ్రస్సెల్స్ లో బాంబు పేలుళ్లను వివిధ దేశాధినేతలు ఖండించారు. ఉగ్రవాదంపై అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలను ఖండిస్తున్నట్టు తెలిపారు.