: నా వద్ద తుపాకీ, పేలుడు పదార్థాలు ఉన్నాయి.. మళ్లీ హత్యారాజకీయాలు ప్రారంభిస్తా: జేడీయూ ఎమ్మెల్యే
జనతాదళ్(యునైటెడ్) ఎమ్మెల్యే గోపాల్ మండల్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లోని నౌగాచియా ప్రాంతంలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ.. తన వద్ద తుపాకీ, పేలుడు పదార్ధాలు ఉన్నాయన్నారు. మళ్లీ హత్యారాజకీయాలు ప్రారంభిస్తానని వ్యాఖ్యానించారు. భాగల్పూర్ జిల్లా గోపాల్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ తనకు ఓటు వేయనప్పటికీ తన వద్ద అధికారం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు ఉన్నాయి కనుక వారందరినీ కాపాడతానని అన్నారు. గతంలో తాను హత్యలు చేశానని, ఇక మళ్లీ మొదలు పెడతానని అన్నారు. అంతేకాదు, ఏప్రిల్ 1నుంచి అమలు కానున్న మద్యనిషేధంపై కూడా ఆయన నితీశ్‌కుమార్‌తో విభేదిస్తున్నారు. అయినా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఈ ఎమ్మెల్యే గారికి కొత్తకాదు. గతంలోనూ ఓ అంశంపై తన మద్దతుదారులను బెదిరిస్తే నాలుక కోసేస్తానంటూ వ్యాఖ్యానించారు. గోపాల్ మండల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏమైనా, గోపాల్ మండల్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను ఇబ్బందుల్లో పడేశాయి.