: హైదరాబాదులోనే కాదు...అమెరికాలో కూడా మన మహిళలే వారికి టార్గెట్!
హైదరాబాదులోనే కాదు, అమెరికాలో కూడా చైన్ స్నాచర్లకు భారత మహిళలే టార్గెట్ గా మారారు. ఇటీవలి కాలంలో అమెరికాలో చైన్ స్నాచింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత మూడు నెలల్లో 13 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా, 11 కేసులు భారతీయ సంతతి మహిళల మెడల్లోంచి చైన్లు లాక్కెళ్లిపోయిన కేసులేనని పోలీసు అధికారులు చెప్పారు. ఇండో అమెరికన్ మహిళలు మెడలో ధరించే బంగారు చైన్లు 300 డాలర్ల నుంచి 3,000 డాలర్ల విలువ చేస్తాయని, వీటిపై కన్నేసిన చైన్ స్నాచర్లు వాటిని తెంపుకెళ్లిపోతున్నారని ప్రీమౌంట్ పోలీస్ అధికారిణి జెనీవా బోస్క్వస్ తెలిపారు. బంగారు ఆభరణాలను దుస్తుల బయటకాకుండా, దుస్తుల లోపల ధరించాలని ఆమె సూచించారు.