: పేలుళ్ల నేపథ్యంలో మోదీ బ్రస్సెల్స్ పర్యటనలో మార్పు?
భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 30వ తేదీన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో పర్యటించాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆధ్వర్యంలో జరగనున్న నాల్గో యూరోపియన్ యూనియన్ సదస్సుకు మోదీ హాజరు కావలసి ఉంది. అయితే రాజధాని బ్రసెల్స్ లో ఈరోజు పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో మోదీ బ్రస్సెల్స్ పర్యటన షెడ్యూల్‌పై అస్పష్టత చోటుచేసుకుంది. పర్యటన వాయిదా పడుతుందా? అన్న విషయంలో అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన వెలువడలేదు.